32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్‌లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు.
ప్రధాని నివాసంలో జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులను ధోవల్ ప్రధానికి వివరించనున్నారు. ప్రధానితో భేటీకి ముందు వివిధ త్రివిధ దళాధిపతులతో చర్చించారు. సౌత్ బ్లాక్‌లో త్రివిధ దళాధిపతుల సమావేశం కొనసాగుతుంది.