Umesh Yadav : ప్రస్తుత కాలంలో నమ్మిన వారినే నట్టేట ముంచే ఘటనలు చూస్తూ ఉంటున్నాం.
అందుకే ఇవి మంచితనానికి రోజులు కాదని పెద్దలు చెబుతూ ఉంటున్నారు.
మేక వన్నె పులిలాగా మోసలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనల్లో స్నేహితులు కూడా ఉంటుంటే ఆ విషయం మరింత బాధిస్తుంది.
తల్లి, తండ్రికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం.
అయితే ఇప్పుడు మారుతున్న రోజులను బట్టి రక్త సంబంధీకులు, బంధువులనే కాదు చివరికి స్నేహితులను కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది.
తాజాగా భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్ కి కూడా ఇలాంటి చేదు ఘటనే ఎదురైంది.
నమ్మి చేరదీస్తే స్నేహితుడే ఏకంగా రూ.44 లక్షలకు టోకరా వేసి మోసం చేశాడు.
ఉమేశ్ యాదవ్ స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్ కు ఎంతోకాలంగా స్నేహం ఉంది.
2010 మే నెలలో జింబాబ్వే పర్యటన ద్వారా భారత జట్టులోకి ఉమేశ్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు.
కొంత విరామం తర్వాత 2014లో భారత జట్టుకు తిరిగి ఎంపికైన ఉమేశ్.. అదే ఏడాది జులై 15న నిరుద్యోగి అయిన శైలేష్‌ను తన మేనేజర్‌గా నియమించుకున్నాడు.
ఫ్రెండ్ కావడంతో శైలేష్ ను నమ్మిన ఉమేశ్ అతడికి తన ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను కూడా అప్పగించాడు.
ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు.
ఈ క్రమంలో నాగపూర్ లో మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని ఉమేశ్ కు చెప్పాడు శైలేష్. దాంతో ఆ స్థలం కొనేందుకు ఆసక్తి చూపించిన ఉమేశ్ యాదవ్ రూ.44 లక్షలను శైలేష్ ఖాతాలో వేశాడు.
అయితే శైలేష్ ఆ ప్లాట్ ను తన పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఉమేశ్ యాదవ్ షాక్ తిన్నాడు.
తన ఫ్రెండే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. ఠాక్రేను తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఉమేశ్ యాదవ్ కోరాడు.
అయితే, ఆ డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బు తనకు ఇచ్చేలా చూడాలని కోరాడు.
ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Nagpur, Maharashtra | A person named Shailesh Thackeray betrayed cricketer Umesh Yadav after taking Rs 44 lakhs to buy a property in Yadav’s name. Case registered u/s 406 & 420 of IPC. According to our info, Thackeray worked as Yadav’s manager earlier: Ashwini Patel, DCP Nagpur pic.twitter.com/XVKGbHGHSK
— ANI (@ANI) January 21, 2023
భారత క్రికెటర్లు వన్డే మ్యాచ్ ఆడితే రూ.6 లక్షలు, టెస్టు ఆడితే రూ.15 లక్షలు, టీ20 మ్యాచ్ ఆడితే రూ.3 లక్షల చొప్పున బీసీసీఐ మ్యాచ్ ఫీజు అందిస్తుంది.
2022 మార్చిలో బీసీసీఐ ఆటగాళ్లకు కేటగిరీల వారీగా కాంట్రాక్టులను ఇచ్చింది బీసీసీఐ.
గ్రేడ్-సీ లో ఉన్న ఉమేశ్ యాదవ్ వార్షిక వేతనంగా కోటి రూపాయలు అందుకుంటున్నాడు.
2022 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతణ్ని రూ.2 కోట్లకు దక్కించుకుంది.
2023 నాటికి ఉమేశ్ యాదవ్ సంపద రూ.58 కోట్లుగా ఉందని సమాచారం.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/