New Delhi: రిటైర్డ్ హవల్దార్ కెకె గోపాలకృష్ణన్ నాయర్ నవంబర్ 23న 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అతనికి ఆర్మీ అధికారులు చేసిన సత్కారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులువురు నెటిజన్లు ఆర్మీ అధికారులను అభినందిస్తున్నారు.
ఇండియన్ ఆర్మీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ సత్కారాన్ని పోస్ట్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాసింది, “#వుయ్ కేర్ హవల్దార్ KK గోపాలకృష్ణన్ నాయర్ (రిటైర్డ్), #వెటరన్ 23 నవంబర్ 2022న 100 సంవత్సరాలు నిండింది. ఆర్మీ సర్వీస్ కార్ప్స్ #ASC అతని శతాబ్ది పుట్టినరోజు సందర్భంగా సత్కరించింది. డైరెక్టర్ తరపున స్మారక చిహ్నాన్ని అందించింది. సాధారణ సరఫరా & రవాణా. #IndianArmy”
ఈ ఫోటో షేర్ చేసాక 81,000 లైకులు, పలు కామెంట్లు వచ్చాయి. దీనిపై నాయర్ మనవడు కూడా స్పందించారు”చాలా గర్వంగా ఉంది! అతను నా తాత. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా కుటుంబం మాజీ రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, IASకి ఎంతో రుణపడి ఉంది. అలాగే, ASC త్రివేండ్రంకు వందనాలు. యూనిట్ స్థాయిలో ఈవెంట్ నిర్వహించింది!మేము మీకు సెల్యూట్ చేస్తాము సార్, అందుకే సైనికుడు ఎప్పుడూ సైనికుడే, జై హింద్, జై జవాన్, జై కిసాన్ అని రాసారు. మరొక నెటిజన్ ఇలా రాసారు.ఈ వృద్ధుడిని (హవిల్దార్) గౌరవించినందుకు నా హృదయం నుండి ప్రత్యేక వందనం. ఈ చర్య మన సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతుంది.