Site icon Prime9

Prime Minister Modi: హిమాలయ శిఖరాల ఎత్తుకు భారత్-నేపాల్ సంబంధాలు.. ప్రధాని మోదీ

India-Nepal

India-Nepal

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇద్దరు ప్రధానులు ప్రత్యేక మరియు విశిష్టమైన ఇండో నేపాల్ సంబంధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చలు జరిపారు.డిసెంబరు 2022లో అత్యున్నత పదవిని స్వీకరించిన తర్వాత ‘ప్రచండ’ తన మొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన కోసం భారతదేశానికి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి నేపాల్ ముఖ్యమైనది.

ఏడు ఒప్పందాలపై సంతకాలు..(Prime Minister Modi)

ప్రధానమంత్రుల సమావేశం తరువాత, భారతదేశం మరియు నేపాల్ వాణిజ్యం మరియు ఇంధనంతో సహా పలు రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరువురు ప్రధాన మంత్రుల సమక్షంలో భారతదేశం మరియు నేపాల్ మధ్య ఒప్పందాల మార్పిడి జరిగింది. ప్రధాని మోదీ, పుష్పకమల్ దహల్ భారతదేశంలోని రుపైదిహా మరియు నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను వర్చువల్ గా ప్రారంభించారు. సంయుక్తంగా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇద్దరు నేతలు బిహార్‌లోని బత్నాహా నుండి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు కార్గో రైలును ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్‌లో, అప్పటి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భారతదేశ పర్యటన సందర్భంగా నేపాల్‌లో రూపే కార్డును ప్రారంభించారు.

నేపాల్‌ ప్రధాని ప్రచండతో చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌-నేపాల్‌ సంబంధాలను హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్లేందుకు మేం ప్రయత్నిస్తూనే ఉంటాం. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని సూపర్‌హిట్‌గా మార్చేందుకు తాను, ప్రధాని ప్రచండ ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.భారతదేశం మరియు నేపాల్ మధ్య మతపరమైన మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఈరోజు రవాణా ఒప్పందాలు జరిగాయి. కనెక్టివిటీని పెంచడానికి మేము కొత్త రైలు మార్గాలను ఏర్పాటు చేసాము. భారతదేశం మరియు నేపాల్ మధ్య నేడు దీర్ఘకాలిక విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఏర్పడింది. ఇది మన దేశాల విద్యుత్ రంగానికి బలాన్ని ఇస్తుందని అన్నారు.

Exit mobile version