Canada Diplomats:ఇండియాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉన్న 40 మంది రాయబారులను ఈ నెల 10 వ తేదీలోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నాడు ఓ వార్తను ప్రచురించింది. అయితే తాజా పరిణామలపై భారత ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనల విడుదల చేయాల్సి ఉంది.
ట్రూడో వ్యాఖ్యలతో..(Canada Diplomats)
కాగా ఇండియాలో కెనడా రాయబారుల సంఖ్య 62 ఉంది. అయితే ఇండియా ప్రభుత్వం ఏకంగా 40 మందిని తగ్గించాలని ఆదేశించింది. కెనడాలో పార్లమెంటులో జరిగిన డిబెట్‌లో ట్రూడో ప్రసంగిస్తూ.. కెనడా జాతీయ భద్రతా అధికారులు నిజ్జర్ హత్య కేసులో ఇండియాప్రభుత్వానికి చెందిన ఏజంట్ల హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారని చెప్పారు. కాగా సర్రేలోని గురునానక్ సిఖ్ గురుద్వారాకు నిజ్జర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ట్రూడో ఆరోపణలను ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది. ఉద్దేశం పూర్వకంగా బురదచల్లుతోందని ఆరోపించింది. కాగా కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని భారత ప్రభుత్వం చెబుతోంది.
ఇటీవల భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుంచి తమకు కెనడా మధ్య ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తాయని అన్నారు. కెనడా ప్రభుత్వం టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని హింసను ప్రేరేపిస్తోందన్నారు జై శంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయని అన్నారు. కెనడా ప్రభుత్వం నిజ్జర్ హత్యకు సంబంధించి ఆధారాలు చూపిస్తే దానికి తగ్గ గట్టి చర్యలు తీసుకుంటామని జై శంకర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు జో బైడెన్ ప్రభుత్వ అధికారులు ఇండియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. నిజ్జర్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణకు సహకరించాలని కోరింది.