Site icon Prime9

Indain Railways: ఇండియన్ రైల్వేలో సరికొత్త సదుపాయం.. ఇకపై వాట్సాప్ తో ఫుడ్ ఆర్డర్

Railways

Railways

Indain Railways: భారత రైల్వేలో మరో సరికొత్త సుదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక రైల్వే ప్రయాణికులు వాట్సాప్ (Whatsapp)నంబర్ ద్వారా తమకు ఇష్టమైన , రుచికరమైన భోజనం ఆర్డర్

చేసుకోవచ్చు.

ప్రయాణికుల సౌకర్యం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్).. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

 

ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ తో (Indain Railways)

ఐఆర్సీటీసీ www.ecatering.irctc.co.in, ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ అనే యాప్‌ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు 87500 01323 అనే వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇకపై రైలు టికెట్‌ బుక్‌ చేసుకోగానే ఈ వాట్సాప్‌ నంబర్‌ నుంచి ఈ-కేటరింగ్‌ సర్వీస్‌ సేవలకు సంబంధించి www.ecatering.irctc.co.in వెబ్‌సైట్‌ లింక్ వస్తుంది.

అక్కడ కస్టమర్లు అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు.

ఆ తర్వాత నుంచి ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది.

ఈ ఆప్షన్ వల్ల ప్రయాణికులు ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

నేరుగా వాట్సాప్ ద్వారా..(Indain Railways)

ఇక మరో ఆప్షన్ కూడా ఉంది. నేరుగా వాట్సాప్ నంబరు ద్వారా ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబరు ఇంటరాక్టివ్ టు వే కమ్యూనికేషన్‌గా మారుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్ చాట్‌బాట్ ప్రయాణికుడితో మెసేజ్‌ల ద్వారా మాట్లాడతారు.

ఈ చాట్ బాట్ ప్రయాణికులు తగిన ఆహారాన్ని బుక్ చేసుకునేందుకు సాయపడుతుంది.

వాట్సాప్ ఈ-క్యాటరింగ్ సేవలను తొలుత కొన్ని రైళ్లలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రయాణికుల ద్వారా వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లలో అందుబాటులోకి తెస్తామని రైల్వేస్(Indain Railways) తెలిపింది.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ సేవల ద్వారా రోజుకు 50 వేల భోజనాలను సరఫరా చేస్తోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version