Minimum support price: ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 07:42 PM IST

New Delhi: రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్ 2022-23 (జులైజూన్), మార్కెటింగ్ సీజన్ 202324 కాలానికి గాను ఎంఎస్‌పీని పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. గోధుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్వింటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోధుమలు 2021-22 లో క్వింటాలుకు రూ.2015 ఉండగా, ప్రస్తుతం రూ. 2,125 కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ. 5,450 కు చేరింది. రబీ పంట కాలానికి గోధుమల పెట్టుబడి వ్యయం రూ. 1,065 గా కేంద్రం అంచనా వేసింది.

పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..

కంది పప్పుకు రూ.500
గోధుమలకు రూ. 100
బార్లీ రూ. 100
శనగలు రూ. 150
సన్‌ఫ్లవర్ రూ.209
ఆవాలు రూ. 400