Site icon Prime9

PMAY: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో 17 లక్షల మంది అనర్హులు

PMAY

PMAY

PMAY: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది. 2018లో పీఎంఏవై కేటాయింపు జాబితాలో దాదాపు 56 లక్షల మంది పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం దీనిపై వెరిఫికేషన్ చేసాక వారి సంఖ్య దాదాపు 39 లక్షలకు పరిమితమయింది. అంటే 30% పేర్లు తొలగించబడ్డాయి. లబ్దిదారుల ఎంపికకు గ్రామసభ ఆమోదం పొందడంతో, ప్రధాన్ పాత్ర చాలా ముఖ్యమైనది. వీరు తమ అధికారాన్ని ఉపయోగించి ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి పేర్లను పొందుపరిచారని పలువురు ఆరోపించారు.ఇందులో బంగ్లాలు కలిగి ఉన్న వ్యక్తుల పేర్లు జాబితాలో ఉన్నాయి.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) క్లీన్ ఇమేజ్‌ని రాబట్టుకోవడానికి ఈ వెరిఫికేషన్ కు ఆదేశించిందని విపక్షనాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకుడు అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నిరాశ్రయుల కోసం డబ్బు పంపుతున్నారు. కానీ ఇక్కడ ప్రధాన్ మరియు ఉపప్రధాన్ కార్లు ఉన్న వ్యక్తులకు జాబితాలో వారి పేర్లను పొందడానికి సహాయం చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీకి అన్నీ తెలుసు. ఈ వెరిఫికేషన్ ఒక డ్రామా అని అన్నారు. మరోవైపు టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం పథకంలో అసలైన లబ్దిదారులను గుర్తించడానికి ఈ డ్రైవ్ చేపట్టింది. ఇప్పటికే 17 లక్షల మంది పేర్లను తొలగించారు. ఇలా చేసే ప్రభుత్వాన్ని ఒకటైనా చూపించగలరా అని సవాల్ చేసారు.

Exit mobile version