Site icon Prime9

Punjab: పంజాబ్ లో రోగి కడుపులోనుంచి ఇయర్‌ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు తీసిన వైద్యులు

Punjab

Punjab

Punjab: పంజాబ్‌లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులోనుంచి తీసిన వస్తువుల జాబితాలో ఇయర్‌ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులు ఉన్నాయి. మానసికంగా అస్వస్థతకు గురయిన ఈ వ్యక్తి తీవ్రమైన దీర్ఘకాలిక కడుపునొప్పితో వైద్యులను సంప్రదించడం జరిగింది.

ఎక్స్ రే తో గుర్తింపు..(Punjab)

అతడికి మూడు గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు పైన చెప్పినవే కాకుండా సేఫ్టీ పిన్స్, షర్ట్ బటన్లు మరియు జిప్‌లు కూడా కనుగొన్నారు. దీనిపై మోగా మెడిసిటీ హాస్పిటల్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, రోగి రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు. జ్వరం మరియు వాంతులు వంటి లక్షణాలతో పాటు సోమవారం అడ్మిట్ అయ్యాడని తెలిపారు. ఎక్స్ రే ద్వారా అతడి కడుపులో వస్తువులు ఉన్నట్లు గుర్తంచిన వైద్యులు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఇటువంటి వస్తువులు రోగి కడుపులోనుంచి బయటపడిన కేసు తమ ఆసుపత్రిలో మొదటిసారి అని డైరక్టర్ తెలిపారు. మానసిక ఆరోగ్యం బాగాలేనందునే సదరు వ్యక్తి వాటిని మింగి ఉంటాడని అన్నారు.

 

Exit mobile version
Skip to toolbar