Maharashtra:మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించడం దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. అపరిశుభ్రతతో నిండిన ఆసుపత్రిలోని టాయ్‌లెట్‌ను అక్కడి డీన్ చేత కడిగించారు. అధికార శివసేన ఎంపీ. శివసేన ఎంపీ ఆదేశించడంతో డీన్ టాయిలెట్ కగడక తప్పలేదు.
డీన్ పై ఎంపీ ఆగ్రహం..(Maharashtra)
నాందేడ్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులతో సహా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవించడంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. దీంతో శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారంనాడు పరిస్థితిని స్యయంగా తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి టాయెలెట్ దుర్గంధంతో నిండిపోవడంతో ఆగ్రహానికి గురైన ఎంపీ వెంటనే ఆసుపత్రి డీన్ శ్యామ్‌రామ్ వాకొడేను టాయ్‌లెట్ కడగమంటూ ఆదేశించారు. దీంతో ఆయన చీపురుకట్ట తీసుకుని టాయెలెట్ శుభ్రం చేయగా, ఎంపీ వాటర్ పైప్‌తో నీటిని కొట్టడం వీడియోలో చిక్కింది. సిబ్బంది అందరూ చూస్తుండగానే టాయ్‌లెట్‌ను డీన్ శుభ్రం చేశారు.
శంకరరావ్ చవాన్ ఆసుపత్రిలో సోమవారంనాడు 24 గంటల్లో 24 మంది మృత్యువాత పడగా, 48 గంటల్లో మృతుల సంఖ్య 31కి చేరింది. మరో 71 మంది పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీనిపై ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. బీజేపీ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, పిల్లలకు మందులు కొనడానికి మాత్రం డబ్బుల్లేవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్‌లో విమర్శించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం నాందేడ్ ప్రభుత్వాసుపత్రి దుస్థితిపై ట్వీట్ చేశారు. పసిపిల్లలతో తహా పలువురు మృత్యువాత పడటం చాలా బాధాకరమని, ఇది సీరియస్ అంశమని అన్నారు. మందులు, సరైన చికిత్స లేకపోవడమే ఈ మరణాలకు కారణంగా తెలుస్తోందన్నారు. 2023 ఆగస్టులో కూడా థానే ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి ఘటనే జరిగిందని, 18 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ మరణాలపై సమగ్ర విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.