Kerala: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పార్కింగ్ స్థలం సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం మొబైల్ పార్కింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కొచ్చి మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (KMTA) నేతృత్వంలోమొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలాలను ముందుగానే రిజర్వ్ చేసుకోవడానికి మరియు చెల్లించడానికి వినియోగదారులను అనుమతించాలని భావిస్తోంది.
రూ. 5 కోట్ల వ్యయంతో..(Kerala)
ఈ ప్రాజెక్ట్ ఎర్నాకులం జిల్లాలో ప్రారంభం కానుంది, దీని అంచనా వ్యయం రూ. 5 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దీనిని చెరిసగం భరిస్తాయి. ఈ మొబైల్ పార్కింగ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ ఆరు నెలల్లో అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. దీనికోసం కొచ్చి మెట్రో నిర్వహించే 51 పార్కింగ్ స్థలాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించారు. వీటిలో గ్రేటర్ కొచ్చిన్ డెవలప్‌మెంట్ అథారిటీ (GCDA), కొచ్చి కార్పొరేషన్ మరియు గోశ్రీ ఐలాండ్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (GIDA) ఉన్నాయి.వాహన కదలికలను ట్రాక్ చేయడానికి నియమించబడిన పార్కింగ్ ప్రాంతాలలో సీసీటీవీ కెమెరా మరియు ఇతర పర్యవేక్షణ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడతాయి. ఇవన్నీ యాప్ లో అందుబాటులో ఉంటాయి. కొచ్చిలో ప్రజా రవాణా విధానాలను సమన్వయం చేయడానికి మరియు మెరుగుపరచడానికి KMTA స్థాపించబడింది. ఈ సంస్థ పార్కింగ్ సేవలను మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాటాదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది.