Site icon Prime9

Ban Drishti IAS : రాముడు సీతను కుక్క ముట్టిన నెయ్యితో పోల్చాడని ఐఏఎస్ ఫ్యాకల్టీ వ్యాఖ్యలు

IAS faculty

IAS faculty

Drishti IAS: రామాయణంలో సీతను కుక్క ముట్టిన నెయ్యితో రాముడు పోల్చాడంటూ ఐఏఎస్ కోచింగ్ సంస్ద ఫ్యాకల్టీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనితో పలువురు నెటిజన్లు ఈ కోచింగ్ సంస్దను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ కావడానికి యువతకు శిక్షణ ఇస్తున్నఈ అధ్యాపకుడు ఒక రచయిత రామాయణాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడంటూ చెప్పాడు. నేను ఈ యుద్ధం చేసింది నీ కోసం కాదు, నా వంశ గౌరవం కోసం. కుక్క నక్కిన నెయ్యి తినడానికి తగదు, సీతా నువ్వు నాకు సరిపోవు అని రాముడు అన్నట్లుగా అతను చెప్పాడు.

వీడియో వైరల్ అయిన తర్వాత, ట్విట్టర్ వినియోగదారులు దృష్టి ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను నిషేధించాలని పిలుపునిచ్చారు.హిందూ మతాన్ని అవమానించినందుకు మరియు రాముడు మరియు సీత గురించి తప్పుడు కథనాలు చేసినందుకు అతడిని నిందించారు. దృష్టి ఐఏఎస్ కేంద్రాన్ని నిషేధించాలనిప్రాచీ సాధ్వి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ఈ కోచింగ్ కేంద్రాన్ని నిషేధించాలని బీజేపీ నేత అరుణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ట్విట్టర్‌లో #BanDrishtiIAS ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఈ శ్లోకాలు రామునిచే చెప్పబడలేదు కాని రచయిత యొక్క భావవ్యక్తీకరణ విధానమని, ఈనాడు విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్న తుసీ దాస్ రామాయణంలో స్థానం పొందలేదని ఉపాధ్యాయుడు వివరిస్తాడు. అయితే వ్యాఖ్యలు మెజారిటీ నెటిజన్లకు ఆగ్రహం కలిగించాయి.

డాక్టర్ వికాస్ దివ్యకీర్తి ఉపాధ్యాయుడు మరియు రచయిత. అతను దృష్టి ది విజన్ పేరుతో కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు, ఇది పూర్తిగా యూపీఎస్సీ ప్రిపరేషన్‌కు అంకితం చేయబడింది. ఇది డాక్టర్ తరుణ వర్మతో కలిసి 1999లో స్థాపించబడింది. కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించక ముందు డాక్టర్ వికాస్ దివ్యకీర్తి ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

Exit mobile version