Site icon Prime9

Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలనుకుంటున్నాను.. అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Karnataka: హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన కర్ణాటకలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

అక్టోబరు 28న జరగనున్న బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. పార్టీ అధినేత మంగళవారం ఇంటింటికి ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కూడా నిర్వహించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఒవైసీ పై విరుచుకుపడ్డారు. ఏఐఎంఐఎం పార్టీ అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు.

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ భారత్ లో విపక్షనేతలు కేంద్రం పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత సంతతి నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికవడం గర్వకారణమని (Mehbooba Mufti) అన్నారు. ‘అయితే బ్రిటన్‌ ఓ మైనారిటీ వర్గ నాయకుడిని తన ప్రధానిగా ఎన్నుకోగా, ఇక్కడ ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి విభజన, వివక్షాపూరిత చట్టాల్లో చిక్కుకున్నాం’ అని జమ్మూకశ్మీరు మాజీ సీఎం, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, శశి థరూర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మొదట కమలా హారిస్‌, ఇప్పుడు రిషి సునాక్‌. అమెరికా, బ్రిటన్‌ ప్రజలు తమ దేశాల్లోని మెజారిటీయేతర పౌరులను అక్కున చేర్చుకుని తమ ప్రభుత్వాల్లో అత్యున్నత పదవులకు ఎన్నుకున్నారు. భారత్‌, మెజారిటీవాదం అనుసరించే పార్టీలు కూడా దీనిని పాఠంగా నేర్చుకోవాలి అని చిదంబరం ట్విటర్‌లో పేర్కొన్నారు. మైనారిటీ వర్గం సభ్యుడైన రిషిని బ్రిటిషర్లు ప్రధానిగా ఎన్నుకున్నారని, భారత్‌లో ఇలా జరుగుతుందా అని థరూర్‌ ట్వీట్‌ చేశారు.

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మెహబూబా ముఫ్తీ, పి.చిదంబరం, శశి థరూర్‌ పై విరుచుకుపడ్డారు. అబ్దుల్‌ కలాం, మన్మోహన్‌సింగ్‌, రామ్‌నాథ్ కోవింద్, తాజాగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము అత్యున్నత పదవులను చేపట్టారని, జమ్మూకశ్మీరు సీఎంగా మైనారిటీ నేతను మెహబూబా అంగీకరిస్తారా అని నిలదీశారు.

 

Exit mobile version