Site icon Prime9

Sukesh Chandrasekhar: కేజ్రీవాల్‌, సత్యేందర్‌ జైన్‌లకు కోట్ల విలువైన వాచీలను బహుమతిగా ఇచ్చాను.. సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ

Sukesh

Sukesh

Delhi: రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాసాడు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌లకు కోట్ల విలువైన వాచీలను బహుమతిగా ఇచ్చానని లేఖలో తెలిపాడు.

ఢిల్లీ సీఎం తనను జాకబ్ అండ్ కో వాచ్ అడిగారని చంద్రశేఖర్ ఆరోపించాడు. నేను మీకు ఇచ్చిన జాకబ్ & కో వాచ్ ఇప్పటికీ మీ వద్ద ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దాని కోసం మీరు ఆ పట్టీని నీలం నుండి నలుపుకు మార్చమని నన్ను అడిగారు. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు మీకు బ్లాక్ డయల్ చేయడం శుభప్రదం అని సలహా ఇచ్చాడు. దీనితో నలుపు పట్టీని దుబాయ్ నుండి చార్టర్డ్ విమానంలో తీసుకువచ్చి అదే రోజు మీకు డెలివరీ చేసానని పేర్కొన్నాడు. అంతేకాదు చంద్రశేఖర్, కేజ్రీవాల్ ప్రభుత్వం న్యూయార్క్ టైమ్స్ మరియు వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తాపత్రికలలో US $ 8 చెల్లించి ఢిల్లీ పాఠశాలల పై చెల్లింపు వార్తలను ప్రచురించేలా చేసిందని తెలిపాడు. కేజ్రీవాల్ జీ కోసం వాచ్ పట్టీని మార్చడానికి నేను ఒకరిని చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి పంపాను. వాట్సాప్‌లో పటేక్ ఫ్లిప్ మరియు కార్టియర్ పాంథర్ ఉమెన్స్ ఎడిషన్ వాచీలను పొందమని మీరు నన్ను అడిగారని సతేంద్ర జైన్ జీ మీరు గుర్తుంచుకోవాలి. రెండింటినీ బహుమతిగా ఇచ్చినప్పటికీ, నన్ను మోసగాడు అంటారా అని సత్యేందర్ జైన్ ను తన లేఖలో ప్రశ్నించాడు.

అంతకుముందు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, కైలాష్ గెహ్లాట్, ఆమ్ ఆద్మీ పార్టీల పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ చంద్రశేఖర్ అక్టోబర్ 8, నవంబర్ 5 తేదీల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ కు లేఖలు రాసాడు. ఇంతలో, చంద్రశేఖర్ తన ఆరోపణలను రుజువు చేయడానికి పాలిగ్రాఫ్ పరీక్షకు ముందుకు వచ్చాడు. అతను పరీక్షకు హాజరు కావాలని కేజ్రీవాల్ మరియు జైన్‌లను కూడా సవాలు చేశాడు. “కేజ్రీవాల్ జీ, తప్పుగా ఏడ్చే బదులు, పాలిగ్రాఫ్ పరీక్షకు దైర్యంగా రండి అంటూ తన లేఖలో రాసాడు.

Exit mobile version