Bihar: వాలెంటైన్స్ డే( ఫిభ్రవరి 14) దగ్గరలోనే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడి మొదలయింది.
ఈ సందర్బం పింకీ అనే యువతిని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు లేఖ రాయడానికి ప్రేరేపించింది.
ఈ లేఖలో అఆమె తన మనోవేదనలను ప్రస్తావించింది.
తాను నిరుద్యోగి అయినందున తన ప్రేమ అసంపూర్తిగా ఉందని రాసింది.
టీవీ డైలీ సోప్ ఒపెరా స్క్రీన్ రైటర్ మరియు బనారస్ వాలా ఇష్క్ రచయిత ప్రభాత్ బంధుల్యతో తాను ప్రేమలో ఉన్నానని పింకీ వెల్లడించింది.
తన నిరుద్యోగ స్థితి కారణంగా వాలెంటైన్స్ డే రోజున ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని ఆమె తెలిపింది.
నేను చాలా టెన్షన్‌లో ఉన్నానని మీకు తెలుసు. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.
కానీ నా పెళ్లికి నిరుద్యోగ సమస్య ఉంది.
ప్రభాత్ బంధుల్యతో నేను నాలుగేళ్లుగా వన్ సైడ్ లవ్ లో ఉన్నాను.
అఫైర్స్ ఉండే వయసులో కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను.
నాకు ఉద్యోగం వస్తే నేను ప్రపోజ్ చేస్తాను, కానీ నేను ఉద్యోగం పొందలేకపోయానని పింకీ తన లేఖలో పేర్కొంది.
పరిస్థితిని చూస్తే, ఈ సంవత్సరం, వాలెంటైన్స్ డే గడిచిపోతుంది.నేను ఇప్పటికీ ఒంటరిగా ఉంటాను.
మరోవైపు, నేను పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నాను, మా నాన్న పెళ్లికి సిద్ధమవుతున్నారని ఆమె తెలిపింది.
వీటన్నింటి గురించి ఆలోచిస్తూ నేను కలత చెందుతాను. ఎన్నో ఆశలతో ఈ ఉత్తరం రాస్తున్నాను.
దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేయండి, లేకపోతే ప్రభాత్ మరొకరితో పెళ్లి చేసుకుంటాడు.
నాకు ఉద్యోగం లేకపోతే ప్రేమతో ఏం చేస్తాను? మీ ఓటరు మరియు రచయిత
ప్రభాత్ బంధుల్య వన్ సైడ్ లవర్ పింకీ (పాట్నా నుండి)” అని ఆమె లేఖను ముగించింది.
బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో
రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ మరియు భూ సంస్కరణల విభాగంలో కొత్తగా నియమితులైన 4,000 మందికి పైగా
అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేసింది.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ
ఉద్యోగాల పేరుతో దేశంలోని యువతను కాషాయ పార్టీ ఎప్పుడూ మోసం చేసిందని,
సమాజాన్ని విభజించడమే వారి అసలు ఉద్దేశ్యమని ఆరోపించారు.
బీహార్‌లోనూ, కేంద్రంలోనూ బీజేపీ చేయనిది తాము చేయబోతున్నామని, రెవెన్యూ శాఖలో
కొత్తగా నియమితులైన 4,325 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని చెప్పారు.
అయితే, ఈ అభ్యర్థులను ఇప్పటికే గత బిజెపి-జెడి (యు) ప్రభుత్వం నియమించిందని,
ఆగస్టులో నియామక లేఖలు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపక్ష బిజెపి ఆరోపించింది.
మాజీ రెవెన్యూ మరియు భూసంస్కరణల శాఖ మంత్రి రామ్ సూరత్ రాయ్ ఆగస్టు 2న
డిపార్ట్‌మెంట్ జారీ చేసిన లేఖను ట్విట్టర్‌లో పంచుకున్నారు, ఇందులో ఎంపికైన అభ్యర్థులు
యాదృచ్ఛిక ఎంపిక ప్రక్రియ ఆధారంగా వివిధ జిల్లాల్లో పోస్ట్ చేయబడతారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/