Site icon Prime9

Vande Bharat Express: హౌరా- న్యూజల్పాయ్‌గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat

Vande Bharat

Vande Bharat Express: ప్రధాని మోదీ శుక్రవారం హౌరా నుంచి న్యూజల్పాయ్‌గురి మార్గంలో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. న్యూజల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు మోదీ. వందేమాతరం ఆలపించిన భూమిలో ఇవాళ వందే భారత్ రైలు ప్రారంభమైందని ప్రధాని మోడీ అన్నారు. మన దేశ చరిత్రలో డిసెంబర్ 30 తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ అండమాన్‌లో భారత స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని తెలిపారు. రాబోయే 8 సంవత్సరాలలో రైల్వేల ఆధునీకరణలో కొత్త ప్రయాణాన్ని చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. హౌరాలో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్స కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు.

వారానికి ఆరు రోజులు పాటు నడిచే హౌరా-న్యూ జల్పాయ్ గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను నడపడానికి సిబ్బంది ఘజియాబాద్‌లో శిక్షణ పొందారు. సెమీ-హై స్పీడ్ వందే భారత్ సర్వీస్‌తో బెంగాల్‌లో కనెక్టివిటీలో కొత్త శకం ప్రారంభమవుతుందని జల్పాయ్ గురి ఎంపీ జయంత రాయ్ అన్నారు.ఇది రాష్ట్రానికిముందడుగు .ఉత్తర బెంగాల్‌లో పర్యాటకాన్ని పెంచుతుందన్నారు. న్యూజల్పాయ్ గురి స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ఒకటిగా అభివృద్ధి చేయడం వల్ల హిమాలయాలు, అడవులు మరియు తేయాకు తోటలతో కూడిన ఉత్తర బెంగాల్‌లో కనెక్టివిటీ కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.

ఇది దేశంలో నడుస్తున్న ఏడవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు 7.45 గంటల్లో 564 కి.మీల దూరాన్ని చేరుతుంది, ఈ మార్గంలో ఇతర రైళ్లతో పోలిస్తే మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇది బార్సోయ్, మాల్దా మరియు బోల్పూర్‌లలో మూడు స్టాపేజ్‌లను కలిగి ఉంటుంది.ఈ రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి.

Exit mobile version