Site icon Prime9

Bomb threat: అమిత్‌ షా ఆఫీస్‌కి బాంబు బెదిరింపు మెయిల్‌!

Home ministry

Home ministry

Bomb threat: న్యూఢిల్లీలోని మినిస్ర్టీ ఆఫ్‌ హోం ఎఫైర్స్‌ ఆఫీస్‌కు బుధవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌వచ్చింది. దాంతో బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌, ఫైర్‌ టెండర్స్‌ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని.. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని పోలీసులు అధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు మెయిల్స్‌ పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని స్కూళ్లకు , విమానాశ్రయాలకు, ఆస్పత్రులకు, జైళ్లకు కూడా ఈ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఢిల్లీనే కాకుండా జైపూర్‌, లక్నో, కాన్పూర్‌, అహ్మదాబాద్‌లో కూడా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ఉత్తుత్తి  బెదిరింపు..(Bomb threat)

ఇలా బెదిరింపు మెయిల్స్‌ వచ్చిన వెంటే స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపించి సోదాలు చేయించారు. సోదాల్లో ఏమీ తేలకపోవడంతో ఇది ఉత్తుత్తి బాంబు బెదిరింపు అనే నిర్ణయానికి వచ్చారు. ఇలా ఢిల్లీలో సుమారు 150 స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. కాగా ఈ మెయిల్స్‌ a mail.ru server నుంచి వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక మెయిల్‌లో వచ్చిన అంశాల విషయానికి వస్తే మీ స్కూల్‌ పరిసరాల్లో పేలుడు పదార్థాలు పెట్టారని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్‌ బుడాఫెస్ట్‌ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు సోమవారం నాడు తెలిపారు. కాగా త్వరలోనే హంగేరీ ప్రభుత్వంతో మాట్లాడి దర్యాప్తు చేయించాలని కోరుతామన్నారు అధికారులు. ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఎక్కడికి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చడానికి ఇంటర్‌పోల్‌ సాయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. స్కూళ్లలో భద్రతను పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాలను తరచూ మానిటరింగ్‌ చేయాలని స్కూళ్లకు వచ్చే మెయిల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించింది.

 

Exit mobile version