Site icon Prime9

Chennai Rainfall: ఎనిమిదేళ్ల తరువాత చెన్నైలో అత్యధిక వర్షపాతం..

Chennai Rains

Chennai Rains

Chennai Rainfall: మిచౌంగ్ తుఫాను కారణంగా సంభవించిన వర్షాలకు చెన్నైలో ఎనిమిది మంది మరణించారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులుగా మారాయి, వాహనాలు కొట్టుకుపోవడంతో విద్యాసంస్థలను మూసి వేయాల్సి వచ్చింది.

వరద పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుండి పని చేయాలని ప్రైవేట్ కార్యాలయాలు తమ ఉద్యోగులను కోరాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో చెట్లు, గోడలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు చేరింది. దీని ఫలితంగా వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు, పలు మెట్రో స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండి చెన్నై విమానాశ్రయం తిరిగి తెరవబడింది. భారీ వర్షాలు మరియు నీటి ప్రవాహం కారణంగా సోమవారం విమానాశ్రయం మూసివేసిన విషయం తెలిసిందే. మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నగరంలో 24 గంటలకు పైగా భారీ వర్షాలు కురిశాయి. 2015లో వరదల తర్వాత చెన్నైలో అత్యధిక వర్షపాతం ఇప్పుడే నమోదయింది. డిసెంబర్ 3 మరియు 4 తేదీల మధ్య, నగరంలోని అనేక ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

గ్రీన్ కారిడార్ ..(Chennai Rainfall)

మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాల కారణంగా చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో, చెన్నై విమానాశ్రయం నుండి అన్నాసాలై మార్గం మరియు ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) వరకు గ్రీన్ కారిడార్ గా నిర్వహించబడుతుందని గ్రేటర్ చెన్నై పోలీస్ డిపార్టుమెంట్ మంగళవారం ప్రకటించింది. పుఅత్యవసర ప్రయాణానికి అన్నాసాలై మరియు ఈస్ట్ కోస్ట్ రోడ్ వెంట ఉన్న గ్రీన్ కారిడార్ మార్గాలను ఉపయోగించాలని ప్రజలకు సూచించింది. పుజాల్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజంబాక్కం నుంచి వడపెరుంబాక్కం రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు ప్రకటించారు. అడయార్ నది ఒడ్డున లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిగ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) వరద హెచ్చరిక జారీ చేసింది.

Exit mobile version