Heroin Seized: జమ్మూలోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు 30 కిలోల హై-గ్రేడ్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కశ్మీర్ నుంచిపంజాబ్‌కు వెళ్లే మార్గంలో ఇన్నోవా కారులో దీనిని తరలిస్తున్నారు. ఈ సందర్బంగా ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
నెలరోజులకిందట ఇద్దరు అరెస్ట్ ..( Heroin Seized)
సెప్టెంబరు 10న, కిష్త్వార్ మరియు రాంబన్‌లో ఇద్దరు అనుమానిత మాదకద్రవ్యాల వ్యాపారులను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎన్ డి పి ఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలు) చట్టం కింద పట్టుకున్నారు. కేష్వాన్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాండేను అరెస్టు చేసి జిల్లా జైలులో బంధించారు. ఖాండేకు అనేక మాదకద్రవ్యాల వ్యాపార కేసుల్లో ప్రమేయం ఉన్న చరిత్ర ఉంది. దీనితో అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీసింది. అదేవిధంగా, కావ్‌బాగ్ గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ షేక్ అనే పెడ్లర్‌ను రాంబన్ జిల్లాలో నిషిద్ధ వస్తువుల అమ్మకాలు మరియు పంపిణీలో ప్రమేయం ఉన్నందున నిర్బంధంలో ఉంచారు.