Heavy rains: జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రాలో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆలయానికి భక్తుల రాకపోకలను నిలిపివేశారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కత్రా నుండి వైష్ణో దేవి ఆలయానికి భక్తుల తరలింపును నిలిపివేశారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణనష్టం జరగలేదని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలోను భారీవరదలు సంభవించాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో తపకేశ్వర్‌లోని మహాదేవ్ ఆలయం సమీపంలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎడతెరిపిలేని వర్షాలతో ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు.