HeatWave: ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఢిల్లీతో పాటు పంజాబ్‌లోని కొంత ప్రాంతం, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే మూడు రోజుల పాటు ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలోనే ఐఎండీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణకంటే ఎక్కువగా ఉండి ఎండలు కాసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో ఒడిషాలోని న్యూపాడాలో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ టచ్ అయ్యింది. తాజా బులిటన్‌లో గురువారం నాడు పంజాబ్‌లోని కొంత భాగం, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, గోవాల్లో వేడి గాడ్పులు వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం నాడు రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత సాధారణ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈనెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.
ఈ నెల 6వ తేదీన ఢిల్లీలలో అత్యధికంగా 41.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా…చివరగా ఏప్రిల్ 27వ తేదీన 40.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 10 నుంచి 20 రోజుల పాటు అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాయలసీయలో ఈ నెల 15,17, 24 తేదీల్లో అత్యధక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. గత నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు బద్దలు కొట్టింది. తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతలో విపరీతంగా ఎండలు కాశాయి. ఎండలకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. అత్యధికంగా హీట్‌వేవ్‌లు నమోదు చేసిన రాష్ర్టాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ర్ట, విదర్భ, మరాట్వాడా, బిహార్, జార్ఖండ్‌లలో సాధారణం కంటే గరిష్ఠంగా ఎండలు కాశాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.