Site icon Prime9

Heat Wave Deaths: దేశవ్యాప్తంగా వడదెబ్బకు 143 మంది మృతి!

Heat Wave Deaths

Heat Wave Deaths

Heat Wave Deaths: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచి కొట్టాయి. ఇక మన దేశంలో ఈ వేసవిలో వడదెబ్బకు సుమారు 143 మంది ప్రాణాలు కోల్పోతే.. 41వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గురువారం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీస్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) తాజా గణాంకాలను విడుదల చేసి ఈ వివరాలు వెల్లడించింది.

ఆసుపత్రుల్లో 40 వేలమంది..(Heat Wave Deaths)

వడ దెబ్బకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 37 మంది చనిపోగా.. తర్వాత స్థానంలో బిహార్‌, రాజస్థాన్‌, ఒడిషాలు ఆక్రమించాయి. ఈ ఏడాది మార్చినుంచి జూన్‌ 20 వరకు దేశవ్యాప్తంగా 143 మంది ఎండ వేడిమిని తట్టుకోలేక చనిపోగా.. మరో 41,789 మంది ఎండ దెబ్బకు గురై ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక వాస్తవంగా చూస్తే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎన్‌సీడీసీ వెల్లడించింది. కాగా ఈ గణాంకాలు పూర్తాగా అప్‌డేట్‌ కాదని కూడా తెలిపింది. ఈ నెల 20న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 14 మంది చనిపోయారు. దీంతో మార్చి నుంచి జూన్‌ వరకు 114 మంది ఉన్న మృతుల సంఖ్య ఏకంగా 143కు ఎగబాకింది. ఢిల్లీలో 21 మంది చనిపోతే.. బిహార్‌, రాజస్థాన్‌లలో చెరో 17 మంది వరకు మృతి చెందారు. అయితే వడదెబ్బకు అత్యధికంగా మృతి చెందిన వారి విషయానికి వస్తే ఉత్తరాదిన ఎక్కువ మంది చనిపోయారు. దీంతో కేంద్రం ముందుస్తుగా ఆస్పత్రులను అప్రమత్తం చేసి వడదెబ్బ తగిలినవారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా బెడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి జెపీ నడ్డా ఈ నెల 20న ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారు. వడదెబ్బ బారిన పెషంట్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్సత్రుల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాక్‌లు, నిత్యావసర మందులు, ఐవీ ప్లూయిడ్స్‌, ఐస్‌ ప్యాక్‌లు సిద్దం చేసి ఉంచుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా ఇండియా నుంచి హజ్‌ యాత్ర కోసం మక్కా మదీనా వెళ్లిన వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సౌదీ అరేబియాలో ఎండ వేడిమికి సుమారు 1,000 మంది వరకు చనిపోయారు. ఇండియా నుంచి వెళ్లిన వంద మంది వరకు ఎండవేడిమిని తట్టుకోలేక మృతి చెందారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో పగటి ఉష్ణోగ్రత 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయింది.

హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి..

ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో తొంభై ఎనభై మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ మరణాలు “సహజ అనారోగ్యం, వృద్ధాప్యం” కారణంగా సంభవించాయని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version