Site icon Prime9

Haryana: నన్ను గెలిపిస్తే.. రూ.20 పెట్రోల్, రూ. 100కే గ్యాస్..!

Haryana sarpanch diff oaths

Haryana sarpanch diff oaths

Haryana: ఎన్నికలు అన్నాక హామీలు ఉంటాయి. అయితే వాటికి కొంత వరకు నెరవేరుస్తుంటారు కొందరు. మరికొందరు ఎన్నో ఉచిత హామీలను ఇస్తాం అన్నీ నెరవేరుస్తామా ఏంటి అన్నట్టు ఉంటారు. అయితే ఈ తరహాలోనే హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విచిత్రమైన హామీలను ఇచ్చాడు. మరి అవేంటో చూసేయ్యండి.

హర్యానాలోని సిర్సాద్‌ గ్రామ సర్పంచ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో జైకరణ్‌ లాత్వాల్‌ అనే అభ్యర్థి పోటీచేస్తున్నారు. ఈయన తనను గెలిపించాలంటూ గ్రామస్థులు కలలో కూడా ఊహించిన హామీలు ఇచ్చాడు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఊరిలో మూడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తానని, ఇంటింటికీ బైక్‌, మహిళలకు మేకప్‌ కిట్స్‌తోపాటు జీఎస్టీ లేకుండా చేస్తానంటూ పోస్టర్లు వేశాడు. అలాగే పెట్రోల్‌ రేటును రూ. 20, గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100కు తగ్గిస్తానంటూ గ్రామ ప్రజలపై హామీల జల్లు కురిపించాడు. ఇంటింటికీ ఉచిత వైఫైతోపాటు, మందుబాబులకు రోజు ఒక బాటిల్‌ ఆల్కాహాల్‌ ఫ్రీగా అందిస్తానని కూడా చెప్పాడు.

వాటితోపాటు సిర్సాద్‌ గ్రామం నుంచి ఢిల్లీకి మెట్రో కనెక్షన్‌, గ్రామం నుంచి పక్కనే ఉన్న పట్టణానికి ప్రతి ఐదు నిమిషాలకో హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తానని వరాల వెల్లువ గుప్పించాడు. కాగా ఇలా ఉన్న హామీలు ఇచ్చిన పోస్టర్‌ను ఐపీఎస్‌ అధికారి అరుణ్‌ బోత్రా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఇప్పుడదని వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తామంతా కూడా వెంటనే సిర్సాద్‌ గ్రామానికి మారిపోతామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: యూపీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్

Exit mobile version