Site icon Prime9

Gujarat H3N2 virus death: గుజరాత్ లో మెట్టమొదటి H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ మరణం .. దేశంలో ఏడుకు చేరిన కేసులు

Gujarat H3N2 virus death

Gujarat H3N2 virus death

Gujarat H3N2 virus death: గుజరాత్‌లో 58 ఏళ్ల మహిళ H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వడోదరలోని ఎస్‌ఎస్‌జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.దీనితో భారత్‌లో  ఈ వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో మొట్టమొదటిసారిగా కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వ్యక్తి  H3N2   వైరస్ తో మరణించారు.

పెరుగుతున్న కేసులు..(Gujarat H3N2 virus death)

శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, జనవరి 2 నుండి మార్చి 5 వరకు, దేశంలో 451 H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, నెలాఖరు నుండి కేసులు తగ్గుముఖం పడతాయని కూడా ప్రభుత్వం తెలిపింది.కొవిడ్‌ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వహాస్పిటల్ ఒక రోజులో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు రిపోర్టు అయ్యాయి.వీటిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా హాస్పిటల్ బయట రోగులు బారులు తీరారు. మరో పక్క ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లు పోటెత్తారు. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

సగం మందికి శ్వాసకోశ సమస్యలు..

ఇటీవల దేశవ్యాప్తంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో దాదాపు సగం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్లే.వీరితో పాటు బయటి రోగుల్లో అత్యధికులకు హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.హెచ్‌3ఎన్‌2 ఉపరకాలు సాధారణ ఇన్‌ఫ్లూయెంజా వేరియంట్స్ కంటే బలంగా ఉన్నాయని తెలిపింది.ఈ వైరస్ సోకిన 92 శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పుల లక్షణాలు కనిపించగా.. 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ఉన్నాయి.ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు బాధిస్తోంది.

Exit mobile version