Site icon Prime9

Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్ ను డిన్నర్ కు పిలిచిన ఆటోడ్రైవర్..

Gujarat-auto-driver-invites-Kejriwal

Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ పర్యటనలో ఊహించని ఆహ్వానం ఎదురయింది. అహ్మదాబాద్‌లో ఆటో రిక్షా డ్రైవర్ల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు, వారిలో ఒక ఆటోడ్రైవర్ కేజ్రీవాల్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. కేజ్రీవాల్ దానికి వెంటనే అంగీకారాన్ని తెలియజేసారు.

“నేను మీకు వీరాభిమానిని. పంజాబ్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చూశాను. నా ఇంటికి కూడా డిన్నర్‌కి వస్తారా?” అంటూ ఆటోడ్రైవర్ విక్రమ్ లల్తానీ అడిగారు. జరూర్ అయేంగే (నేను తప్పకుండా వస్తాను)” అని కేజ్రీవాల్ వేగంగా సమాధానం ఇచ్చారు. మీరు నన్ను మీ ఆటోలో నా హోటల్ నుండి పికప్ చేస్తారా అంటూ కేజ్రీవాల్ అడగడంతో అక్కడ వారందరూ వెంటనే చప్పట్లు, కేకలు వేసారు. దీనితో లల్తాని సంతోషంగా తల వూపాడు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఆయన ఏకైక ఎజెండా. కేజ్రీవాల్ తన మునుపటి పర్యటనలో, అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, 300 యూనిట్ల వరకు, మహిళలు మరియు నిరుద్యోగులకు భత్యాలు మరియు నాణ్యమైన వైద్యం మరియు ఉచిత విద్యను హామీ ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar