Site icon Prime9

ATS Raids : వదోదరలో గుజరాత్ ఏటీఎస్ దాడులు.. రూ.500 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ATS Raids

ATS Raids

ATS Raids: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వదోదర నగర శివార్లలోని ఒక తయారీ యూనిట్‌పై దాడి చేసి దాదాపు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత ఎండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. మంగళవారం రాత్రి వడోదర సమీపంలోని చిన్న ఫ్యాక్టరీ-కమ్-గోడౌన్ వద్ద దాడి చేసిన సమయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఏటీఎస్ అధికారి అన్నారు.

ప్రాథమిక విచారణలో నిందితులు చట్టబద్ధంగా రసాయనాల తయారీ ముసుగులో ఎండీ డ్రగ్, మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నట్లు తేలిందని ఆయన తెలిపారు.మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, చెప్పారు.ఈ ఏడాది ఆగస్టులో వడోదర నగరం సమీపంలోని గోదాము నుంచి దాదాపు రూ.1,000 కోట్ల విలువైన 200 కిలోల మెఫెడ్రోన్‌ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

Exit mobile version