Site icon Prime9

Gujarat: గుజరాత్‌లో అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృతి

lightning strikes

lightning strikes

Gujarat: గుజరాత్‌లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పిడుగులు పడి 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈఓసీ ) అధికారి ఈ విషయాన్ని తెలిపారు.

16 గంటల్లో 117 మిల్లీమీటర్ల వర్షపాతం..(Gujarat)

దాహోద్ జిల్లాలో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అమ్రేలి, బనస్కాంత, మెహసానా, పంచమహల్, దేవ్‌భూమి ద్వారక, అహ్మదాబాద్, సబర్‌కాంత, సూరత్, బొటాడ్, ఖేదా మరియు సురేంద్రనగర్ లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఎస్‌ఈఓసీ అధికారులు తెలిపారు. ఎస్‌ఈఓసీ డేటా ప్రకారం, గుజరాత్‌లోని 252 తాలూకాలలో ఆదివారం 234 చోట్ల భారీ వర్షపాతం నమోదైంది, సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్ మరియు అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సాధారణ జీవితం అస్తవ్యస్తంకాగా పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బి జిల్లాలో వర్షాలు కారనంగా సిరామిక్ ఫ్యాక్టరీలు మూసివేయవలసి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇలాఉండగా గుజరాత్ లో పిడుగుపాటు కారణంగా సంభవించిన మరణాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు గుజరాత్‌లోని వివిధ నగరాల్లో పిడుగుల కారణంగా చాలా మంది మరణించిన వార్తలకు నేను చాలా బాధపడ్డాను. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి కోలుకోలేని నష్టానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. స్థానిక పరిపాలన సహాయక చర్యల్లో నిమగ్నమై, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో రాశారు.సోమవారం వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Exit mobile version