Site icon Prime9

GST collection: దేశ వ్యాప్తంగా భారీగా జీఎస్టీ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ దూకుడు

Huge GST collections across the country.. AP aggression in Telugu states

New Delhi: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో భారీ రాబడిని కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలకు గాను రూ. 1,51,718 కోట్లు వసూలైన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 16.6 శాతం మేర పెరిగిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సీజిఎస్టీ కింద రూ. 26,039 కోట్లు, ఎన్జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు, సెస్సు కింద రూ. 10.505 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 81.778 కోట్లు వసూలైన్నట్లు కేంద్రం ప్రకటించింది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు భారీ వసూళ్లను ఆర్ధిక శాఖ ఆర్జించింది. ఏప్రిల్ లో రూ. 1.67కోట్లు, అక్టోబర్ నెలలో రూ. 1.51 కోట్ల జీఎస్టీ ద్వారా వసూలైయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో విభన్నంగా జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. అక్టోబర్ కు సబంధించి ఏపీలో రూ. 3,579 కోట్లు, రూ. 4,284 కోట్లు రాబడిని ఆర్జించిన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఏపీ 24శాతం వృద్ధితో, తెలంగాణ 11శాతం వృద్ధిని సాధించాయని ఆర్ధిక శాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే 19శాతం వృద్ధిని కనపరుస్తూ మహారాష్ట్ర రూ. 23,037 కోట్లు ఆర్జించిన్నట్లు ఆర్ధిక శాఖ పేర్కొనింది.

ఇది కూడా చదవండి: LPG cylinders: నేటి నుండి గ్యాస్ సిలెండర్ల డెలివరీకి ఓటిపి తప్పనిసరి..100 స్మార్ట్ సిటీల్లో అమలు

Exit mobile version