Site icon Prime9

GST Collections: అక్టోబరులో రూ.1.72 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST

GST

 GST Collections :అక్టోబర్ నెలలో వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణనీయమైన రాబడి ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన రెండవ అత్యధికం కావడం విశేషం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది సంవత్సరానికి 13% గణనీయమైన వృద్ధిని సాధించింది. అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు, మొత్తం రూ.1,72,256 కోట్లు గా ఉన్నాయి.

వసూళ్లు పెరుగుదలకు కారణాలివే..( GST Collections)

జీఎస్టీ వసూళ్లలో స్థిరమైన పెరుగుదల సానుకూల ధోరణిని సూచిస్తుంది.ఇది గత సంవత్సరంతో పోల్చితే గణనీయమైన పెరుగుదలను సూచించడమే కాకుండా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయ ఉత్పత్తిని కూడా ప్రదర్శిస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పెరిగిన ఆర్దిక కార్యకలాపాలు, మరియు అధిక వినియోగదారు వ్యయం కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ శక్తిని ప్రదర్శిస్తోంది. వాణిజ్య కార్యకలాపాల విస్తరణ, ముఖ్యంగా తయారీ, సేవలు మరియు ఇ-కామర్స్ వంటి రంగాలలో పన్ను రాబడిని పెంచింది.జీఎస్టీ సమ్మతి చర్యలను కఠినంగా అమలు చేయడం వల్ల పన్ను వసూళ్లు మెరుగయ్యాయి. జీఎస్టీ రిటర్నులు వెంటనే సమర్నించాలంటూ ఆర్దిక శాఖ ప్రోత్సహించింది. దిగుమతులు మరియు అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుదల జీఎస్టీ వసూళ్లను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

 

Exit mobile version