Shalija Dhami:అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు, భారత వైమానిక దళం (IAF) వెస్ట్రన్ సెక్టార్‌లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామిని ఎంపిక చేసింది. గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి ప్రతిష్టాత్మకమైన కమాండ్‌ని స్వీకరించడం సాయుధ దళాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా అధికారులకు ఒక పెద్ద సందేశం. భారత వైమానిక దళం చరిత్రలో ఒక మహిళా అధికారికి ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్ కమాండ్ బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి.
మిస్పైల్ స్క్వాడ్రన్‌కు మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్..(Shalija Dhami)
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఐఏఎఫ్ మిస్పైల్ స్క్వాడ్రన్‌కు మొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్‌గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి నియామకం భారత సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి.అంతకుముందు ఆగస్టు 2019లో, ఫ్లయింగ్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా మారిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా అధికారిగా షాలిజా ధామి వార్తల్లో నిలిచారు.పంజాబ్‌లోని లూథియానాలో జన్మించిన గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశించారు. ఆమెకు 2800 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. 2003లో, ఆమె తన మొదటి సారిగా HAL HPT-32 దీపక్ నడిపారు. దీని తరువాత, ధామీ 2005లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందారు . 2009లో స్క్వాడ్రన్ లీడర్‌గా మారారు.
మొదటి మహిళా ఫ్లైట్ కమాండర్..
డిసెంబర్ 2016లో, ధామివింగ్ కమాండర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2019 ఆగస్టులో ఫ్లైట్ కమాండర్‌గా నియమితులైన భారతదేశంలో మొదటి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో చేతక్ హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.షాలిజా ధామి ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ యొక్క ఆపరేషన్స్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
పోరాట, కమాండ్ నియామకాల్లో మహిళా అధికారులకు ఇది మరో మైలురాయి. లేడీ ఆఫీసర్ నాయకత్వం వహించే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు సాయుధ బలగాలకు కీలకమైన కార్యాచరణ ఆస్తిగా ఉంటాయని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా (రిటైర్డ్) అన్నారు.ఐఏఎఫ్ మరియు నౌకాదళం కూడా మహిళా అధికారులను తమ ప్రత్యేక దళాల యూనిట్లలో చేరడానికి అనుమతించాయి.గరుడ్ కమాండో ఫోర్స్ మరియు మెరైన్ కమాండోలు వరుసగా, వారి ర్యాంక్‌లలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించాయి.ఫిబ్రవరిలో, సైన్యం మొదటిసారిగా మహిళా అధికారులను కమాండ్ పాత్రలకు కేటాయించడం ప్రారంభించింది. మరియు వారిలో దాదాపు 50 మంది ఉత్తర మరియు తూర్పు కమాండ్‌ల క్రింద ఫార్వర్డ్ లొకేషన్‌లతో సహా కార్యాచరణ ప్రాంతాలలో యూనిట్ హెడ్ లుగా ఉన్నారు. ఈ ప్రాంతం చైనాతో భారతదేశ సరిహద్దులను కాపాడుతోంది.