SIMI: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం -యూఏపీఏ కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ‘భారత్ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతను బెదిరించేలా, శాంతి-మత సామరస్యానికి భంగం కలిగించడంలో సిమి నిమగ్నమైందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పదేళ్లకిందట తొలిసారి నిషేధం..( SIMI:
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై 2014 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది. 2019లో ఈ నిషేధాన్ని ఐదేళ్లపాటు పొడిగించింది. 1977 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సిమిని స్థాపించారు. ప్రారంభంలో, విద్యార్థుల క్రియాశీలతపై ఈ సంస్థ దృష్టి సారించింది. దేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది.అయితే కాలక్రమేణా రాడికల్ సిద్ధాంతాలను ప్రోత్సహించడంతో పాటు భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చే ఎజెండాతో సిమి పని చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2001లో తొలిసారిగా చట్టవిరుద్ధ సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014లో భోపాల్ జైలు నుంచి ఖైదీల పరార్, 2014లో బెంగళూరు స్టేడియంలో పేలుడు, 2017లో గయా పేలుళ్లతో సహా దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో సిమి కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో 2014లో ఆ సంస్థపై విధించిన నిషేధాన్ని తాజాగా మరో ఐదేళ్లపాటు కేంద్రం పొడిగించింది.