Supreme Court: సుప్రీంకోర్టు సోమవారం నాడు పలు రాష్ట్రాల గవర్నర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఎందుకు నాన్చుతున్నారని ప్రశ్నించింది. కాగా పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ భన్వారీలాల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ ఉద్దేశం పూర్వకంగా బిల్లులను తొక్కిపెట్టారని పిటిషన్‌లో పేర్కొంది. సుప్రీంకోర్టుకు బిల్లుల అంశం వచ్చే వరకు వేచి చూసే ధోరణికి తెరపడాలన్నారు. గవర్నర్లు తమ మనస్సాక్షి ప్రకారం ఆలోచించాలని సూచించారు. వారు ప్రజాప్రతినిధులు కారు. ప్రజల నుంచి నేరుగా ఎన్నికోబడిన వారు కాదని గుర్తుంచుకోవాలన్నారు.
సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంజాబ్ బిల్లుల గురించి తనకు నవంబర్ 10వ తేదీలోగా అప్‌డేట్ ఇవ్వాలని ఆదేశించారు. కాగా పంజాబ్ శాసనసభ మొత్తం 27 బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపితే 22 బిల్లులకు పురోహిత్ ఆమోదం తెలిపారు. ఇటీవల కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌కు మధ్య అగాధం పెరిగింది. కాగా అక్టోబర్ 20న జరిగిన ప్రత్యేక బడ్జెట్ సెషన్‌లో మూడు ద్రవ్యవినిమయ బిల్లును ప్రతిపాదించారు. కాగా నవంబర్ 1వ తేదీన పురోహిత్ మొత్తం మూడు మనీబిల్లులకు గాను రెండు బిల్లులకు ఆమోదం తెలిపారు.మిగిలిన బిల్లులను పరీక్షిస్తానని.. చట్టం ప్రకారం అనుమతించాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పారు. కాగా మూడు ద్రవ్యవినియమ బిల్లు లేదా మనీ బిల్లును ఆమోదించకుండా గవర్నర్ తొక్కిపెట్టడంతో పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గత నెల 19న గవర్నర్ కు లేఖ రాశారు.
కాగా పంజాబ్ గవర్నర్ పురోహిత్… పంజాబ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ — అమాండ్‌మెంట్ బిల్లు -2023, పంజాబ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమాండమెంట్ బిల్లు 2023, ది ఇండియన్ స్టాంప్ పంజాబ్ అమాండ్‌మెంట్ బిల్లు 2023 ని ఆమోదించకుండా తొక్కిపెట్టారు. కాగా ఈ బిల్లులు గత నెల 20-21న అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సింది ఉంది. అయితే గవర్నర్ మాత్రం అక్టోబర్ 20-21 బడ్జెట్ సెషన్ చట్ట వ్యతిరేకమని..ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా ఇది చట్టవ్యతిరేకమని మాన్‌కు తెలియజేశారు.. దీంతో పంజాబ్ ప్రభుత్వం అక్టోబర్ 20 రెండు రోజుల సెషన్‌ను ఆపేయాల్సి వచ్చింది.
ఇలాఉండగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌కు .. గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి సంబంధాలు. అక్కడ బిల్లులు ఆమోదించకుండా గవర్నర్‌నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు గవర్నర్. కేరళలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు ఎక్కింది. రెండేళ్ల నుంచి గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ ఉన్నాయని కేరళ ప్రభుత్వం కోర్టుకు ఫిర్యాదు చేసింది.