Site icon Prime9

Sasikala: పన్నీర్‌సెల్వం బహిష్కరణ చెల్లదు.. వీకే శశికళ

Tamil Nadu: ఏఐఏడీఎంకే నుంచి ఓ పన్నీర్‌ సెల్వంను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం చెల్లదని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అన్నారు. ఇది కేవలం స్వార్దప్రయోజనాలకోసం సమావేశమయిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని శశికళ అన్నారు.

ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగే సమావేశంగా నేను భావిస్తున్నాను. హైకోర్టులో నేను వేసిన కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు కాబట్టి ఈరోజు జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశం ఖచ్చితంగా చెల్లదు. అలా వ్యవహరిస్తే కొంతమంది నాయకులు కొత్త పార్టీని ప్రారంభించవలసి వస్తుంది అని శశికళ అన్నారు. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన తర్వాత శశికళ సీఎంగా పళనిస్వామిని ఎంపిక చేయడం, పన్నీర్ సెల్వం ఆమెపై తిరుగుబాటు చేయడం తెలిసిని విషయమే.

సోమవారం జరిగిన ఏఐఏడిఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామి (ఇపిఎస్) అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2017 నుండి 2021 వరకు తమిళనాడు సీఎంగా వున్న పళనిస్వామి ప్రధాన కార్యాలయ కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ప్రచార కార్యదర్శితో సహా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు.

Exit mobile version