Prime9

Sonia Gandhi Health Update: అనారోగ్యంతో ఆస్పత్రిలో సోనియా గాంధీ.. తాజా అప్డేట్ ఇదే..!

Sonia Gandhi Health Bulletin Released: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

 

ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ చెప్పారు. గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు సోనియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు సోనియాగాంధీకి ఆరోగ్యం బాగలేకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు.

 

Exit mobile version
Skip to toolbar