Elaben Bhatt: సేవా ఫౌండర్, గాంధేయవాది ఎలబెన్ భట్ కన్నుమూత

ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఎలబెన్ భట్ (89) కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు.

Ahmedabad: ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఎలబెన్ భట్ (89) కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు.

టెక్స్ టైల్ ట్రేడ్ యూనియన్ సంస్ధలో భాగంగా 1972లో మహిళల కో-ఆపరేటివ్స్ అండ్ నేషనల్ డ్రేడ్ యూనియన్స్‌లో పేరున్న ‘సేవ’ను ఎలబెన్ ప్రారంభించారు. మహిళలకు చిన్నపాటి రుణ సౌకర్యం కల్పించారు 18 రాష్ట్రాలుకు చెందిన 21 లక్షల మంది పేదలు, స్వయం ఉపాధి మహిళా కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు. వృత్తిరీత్యా ఎలబెన్ భట్ న్యాయవాది. సబర్మతి ఆశ్రమ్ ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సేవలు అందించారు.

ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలకు సలహాదారుగా కూడా ఆమె వ్యవహరించారు. మానవ హక్కులు, శాంతిని పెంపొందించేందుకు నెల్సన్ మండేలా ఏర్పాటు చేసిన ప్రపంచ నేతల గ్రూపు ‘ఎల్డర్స్’‌లో ఆమె 2007లో చేరారు. మహాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్‌ ఛాన్సలర్ పదవిని కూడా చేపట్టివున్నారు. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ఆమె అందుకున్నారు. ఎలబెన్ భట్‌కు కుమారుడు మిహిర్, కుమార్తె అమిమయిలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Gaurav Bhatia: స్వచ్ఛమైన గాలిని అందించలేకపోయారు.. ఢిల్లీ సీఎం రాజీనామా చేయాలన్న భాజపా నేత గౌరవ్ భాటియా