Gadwal MLA Krishna Mohan Reddy: టీ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా..గ్రేటర్ పరిధిలో ఉన్న మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం అర్దరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే..
ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు నియమితులయ్యారు. కేశవరావును సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేకేకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇచ్చింది. కేకే రెండురోజుల క్రితమే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు.ఆయన కుమార్తె, విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. విజయలక్ష్మి మార్చి 30న బీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు.