Site icon Prime9

BJP Parliamentary Board: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరి, శివరాజ్ సింగ్‌ అవుట్

Gadkari and Shivraj Singh out of BJP Parliamentary Board

BJP Parliamentary Board: బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, కేంద్ర ఎన్నికల కమిటి ప్రకటించింది. పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించగా.. కేంద్ర ఎన్నికల కమిటిలో 15 మందికి అవకాశం కల్పించారు. ఈ రెండు కమిటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కే లక్ష్మణ్ చోటు లభించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో మోదీ, అమిత్‌షా, యడ్యూరప్ప రాజ్‌నాథ్, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్ సభ్యులుగా ఉన్నారు.

అగ్రనేతలు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పార్లమెంటరీ బోర్డులో ఈసారి చోటు దక్కలేదు. అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌కు పార్లమెంటరీ బోర్డులోనూ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ చోటు దక్కింది. అలాగే, శివసేన రెబల్ ఏక్‌నాథ్ షిండేతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకునేందుకు ఇష్టపడి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఎలక్షన్ కమిటీలో బీజేపీ అధిష్ఠానం చోటు కల్పించింది.

Exit mobile version