Site icon Prime9

Atiq Ahmed Journey: గ్యాంగ్ స్టర్ నుంచి పార్లమెంట్ సభ్యుడివరకూ .. అతిక్ అహ్మద్ జర్నీ

Atiq Ahmed Journey

Atiq Ahmed Journey

Atiq Ahmed Journey: ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయనాయుడిగా మారిన అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లు ఐదు రోజుల పోలీసు రిమాండ్‌లో కోర్టు నిర్దేశించిన వైద్య పరీక్షల కోసం వెడుతుండగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తికి చెందిన అతిక్ అహ్మద్ 1962లో జన్మించాడు.ప్రస్తుతం పరారీలో ఉన్న షైస్తా ప్రవీణ్‌తో వివాహం జరిగింది. అతీక్ మరియు షైస్తాలకు అలీ, ఉమర్, అహ్మద్, అసద్, అహ్జాన్ మరియు అబాన్ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. శుక్రవారం ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ మరణించిన సంగతి తెలిసిందే.అష్రఫ్ అని కూడా పిలువబడే ఖలీద్ అజీమ్, అతిక్ సోదరుడు, గతంలో శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.

పొలిటికల్ కెరీర్..(Atiq Ahmed Journey)

అతిక్ 1989లో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (W) నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను వరుసగా ఐదు సార్లు ఈ సీటును గెలుచుకున్నాడు.2004లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం రాజు పాల్ రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలో అలహాబాద్ (వెస్ట్ ) నుండి ఖాళీ చేయబడిన స్థానం నుండి గెలిచాడు. అతిక్ తన సోదరుడు అసద్‌ను రంగంలోకి దించాడు. అయితే ఆ ఎన్నికల్లో పాల్ విజయం సాధించారు.పాల్ 2005 ప్రారంభంలో కాల్చి చంపబడ్డాడు .దీనితో సీటు మళ్లీ ఖాళీ అయింది. ఈసారి, అష్రఫ్ పాల్ భార్య పూజపై ఎన్నికల్లో విజయం సాధించారు. హత్యలో అష్రఫ్ ప్రధాన నిందితుడు కాగా, అతిక్ సహ నిందితుడు.

అతిక్ 2009లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించాడు. ఎస్పీ, బీఎస్పీ అతనికి టిక్కెట్ నిరాకరించడంతో, అతిక్ ప్రతాప్‌గఢ్ నుండి అప్నా దళ్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు.అతను 2012లో అప్నా దళ్ టిక్కెట్‌పై మళ్లీ అలహాబాద్ ( వెస్ట్ ) నుండి పోటీ చేసి రాజు పాల్ భార్య చేతిలో ఓడిపోయాడు. 2014లో ఎస్పీ టిక్కెట్ పై అతిక్ శ్రావస్తి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

క్రిమినల్ కేసులు..

17 ఏళ్ల వయసులో అతిక్ 1979లో హత్యకు పాల్పడ్డాడనిమొదట ఆరోపణలు వచ్చాయి.2016లో, అతిక్ మరియు అతని సహాయకులు సామ్ హిగ్గిన్‌బాటమ్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్సెస్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు విద్యార్థులను పరీక్షలకు హాజరుకాకుండా తప్పించడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోందిమరుసటి సంవత్సరం, అలహాబాద్ హైకోర్టు నిందితులందరినీ అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది, అందులో అతిక్ కూడా ఉన్నారు. అయితే అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

2018లో, వ్యాపారవేత్త మోహిత్ జైస్వాల్ డియోరియా జైలులో అతిక్ తనపై దాడి చేశారని ఆరోపించారు. అతిక్ గ్యాంగ్ తన నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోందని జైస్వాల్ ఆరోపించారు. తాను అంగీకరిచంకపోవడంతో జైలుకు తీసుకెళ్లి కొట్టారని ఆరోపించారు. దీనితె రాష్ట్ర ప్రభుత్వం అతిక్‌ను బరేలీ జైలుకు తరలించింది. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ జైలుకు తరలించారు.మరుసటి సంవత్సరం, నైనీ జైలు నుంచి అతిక్‌ను గుజరాత్‌కు తరలించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో గత నెలాఖరున దోషిగా నిర్ధారించబడి జీవిత ఖైదు విధించబడింది. అతనిపై 100కి పైగా ఉన్నకేసుల్లో అతడికి తొలి శిక్ష కావడం గమనార్హం.హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, మోసం, బెదిరింపులు, భూకబ్జాలు వంటి అనేక నేరాల్లో అతడు పాల్గొన్నాడు.గత నాలుగు దశాబ్దాల్లో అతిక్ పై 101 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version