Site icon Prime9

Helicopter Ride: ఛత్తీస్‌గఢ్ లో 10,12వ తరగతి టాపర్లకు ఉచిత హెలికాప్టర్ ప్రయాణం

helecopter

helecopter

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 10 మరియు 12 తరగతుల టాపర్‌లకు ఉచిత హెలికాప్టర్ ప్రయాణం కల్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షల్లో కనీసం 125 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శనివారం రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ రైడ్‌లో సత్కరించారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఇచ్చిన హామీలో భాగంగా 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లాల వారీగా టాపర్లకు ఏడు సీట్ల హెలికాప్టర్‌లో ప్రయాణానికి తీసుకువెళ్లారు.

బోర్డు పరీక్షల్లో టాపర్లకు ఇంత విశిష్టమైన రీతిలో సన్మానాలు నిర్వహించడం ఇదే తొలిసారని వీరికి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10, 12వ తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తామని సీఎం ప్రకటించడంతో విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం అని రాష్ట్ర మంత్రి ప్రేంసాయి సింగ్ టేకం అన్నారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల్లో మొదటి 10 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో రివార్డ్‌ను అందజేస్తామని మే నెలలో ముఖ్యమంత్రి ప్రకటించారు.

12వ తరగతి బోర్డు పరీక్షలో ఛత్తీస్‌గఢ్‌లో 10వ ర్యాంకు సాధించిన రాయ్‌పూర్‌కు చెందిన వర్షా దేవాంగన్ మాట్లాడుతూ హెలికాఫ్టర్ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేసానంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపాడు. నేను హెలికాప్టర్‌లో ప్రయాణించడం చాలా ఆనందంగా మరియు చిరస్మరణీయమైన క్షణం. ఎందుకంటే నేను వచ్చిన ప్రదేశానికి సరైన రహదారి కనెక్టివిటీ మరియు ఇతర సౌకర్యాలు కూడా లేవని నారాయణపూర్ జిల్లా 10వ తరగతి విద్యార్థి దేవానంద్ కమేటి అన్నాడు.

Exit mobile version