Former MP Anand Mohan: మూడు దశాబ్దాల నాటి ఐఏఎస్ అధికారి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలు నుంచి వాకౌట్ చేశారు. అతడిని గురువారం తెల్లవారుజామున విడుదల చేశారు. ఆనంద్ మోహన్ విడుదలపై సీఎం నితీష్ కుమార్‌ను ప్రతిపక్ష బిజెపి టార్గెట్ చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బాధిత ఐఏఎస్ అధికారి కుటుంబం ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసింది.
1994లో ముజఫర్‌పూర్‌లో జిల్లామేజిస్ట్రేట్ కృష్ణయ్యను మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో 2007లో ఆనంద్ మోహన్ ను దోషిగా నిర్దారించారు. ట్రయల్ కోర్టు మోహన్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే ఉన్నత న్యాయస్థానం దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఆనంద్ మోహన్ ను విడుదల చేసేందుకు నితీష్ ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించింది. రాష్ట్ర న్యాయ శాఖ, సోమవారం ఆలస్యంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, మోహన్‌తో సహా 27 మందిని విడుదల చేయాలని ఆదేశించింది, వీరంతా 14 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలులో ఉన్నారు.
బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, హత్యకు గురైన కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య రాజకీయాల్లో నేరస్థులను ప్రోత్సహించకూడదని అన్నారు. తన భర్త తప్పు చేయని కారణంగా చంపబడ్డాడని అన్నారు.ఇది ముఖ్యమంత్రి చాలా తప్పుడు నిర్ణయం. ఎన్నికల్లో పోరాడటానికి మంచి వ్యక్తులను తీసుకోవాలి, అప్పుడే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, నేరస్థులను తీసుకుంటే, ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతారు అని ఆమె అన్నఈ విషయంలో తన భవిష్యత్ కార్యాచరణ గురించి అడగ్గా, తాను ఒంటరిగా నిర్ణయం తీసుకోలేనని, తన భర్త 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.ఇలా ఉండగా తన విడుదలకు కృషి చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఆనంద్ మోహన్ కృతజ్జతలు తెలిపారు.