Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
నేను సంతృప్తి చెందాను..(Shivraj Singh Chouhan)
కాబోయే సీఎం మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎం జగదీశ్ దేవదా, రాజేంద్ర శుక్లాలను ఆయన అభినందించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ‘లాడ్లీ బెహనా’ పథకాలు కారణమని అన్నారు.సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను బీజేపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్న నమ్మకం నాకు ఉందని, ప్రగతి, అభివృద్ధి పరంగా మధ్యప్రదేశ్ కొత్త పుంతలు తొక్కుతుందని, ఆయనకు అండగా ఉంటాననిఅన్నారు. మరోసారి బీజేపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు నేను సంతృప్తి చెందాను. నా హృదయం ఆనందం మరియు సంతృప్తితో నిండిపోయిందని అన్నారు.
రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చి వెలుగు తీసుకొచ్చామని అన్నారు. ఇంతకు ముందు ఆడపిల్లలను కడుపులోనే చంపేశామని, అయితే లాడ్లీ బెహనా వంటి పథకాలు సమస్య పరిష్కారానికి దోహదపడ్డాయని ఆయన అన్నారు.1990లో బుద్ని నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికయిన చౌహాన్ మధ్యప్రధేశ్ కు సుమారుగా 16 ఏళ్లపాటు సీఎంగా సేవలందించారు. 2005 నుంచి 2018 వరకు, మళ్లీ 2020 నుంచి 2023 వరకు అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డుకెక్కారు. తన పదవీకాలంలో పలు సంక్షేమపధకాలు అమలు చేసారు.మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగింది. రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 66 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.