Site icon Prime9

Viral Video: ఇదెక్కడి వింత.. పెళ్లిభోజనానికి ఆధార్ తప్పనిసరి..!

marriage food

marriage food

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలోని పెళ్లిలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు ఆధార్ కార్డు చూపిస్తేనే విందు భోజనం పెడతామంటూ పెళ్లికూతురి కుటుంబం శరతు పెట్టింది. దీనితో వధూవరులను ఆశీర్వదించి చక్కటి భోజనం తినివెళ్లాలనుకున్న బంధువులు కాస్త ఆగ్రహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక ఆధార్ చూపించిన వారు మాత్రం ఎంచక్కా భోజనం చేసి వెళ్లారు. మరి ఇలా వారు ఆ వింతైన శరతు ఎందుకు పెట్టారో ఓ సారి చూసేద్దామా..

యూపీలోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లోని ఒక మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఇటీవల ఒక కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకే వేదికిపై పెళ్లి జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. పిలిచినవారే కాకుండా పిలవనివారు చాలా మంది హాజరయ్యారు. దానితో ఆ కుటుంబం ఆందోళన చెందింది. భోజనాలు సరిపోవనుకుని పెళ్లికూతురి కుటుంబం ఆలోచించారు. వారికి ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్థంకాలేదు. ఈ క్రమంలో వారికి ఓ విచిత్రమైన ఆలోచన కలిగింది. అయితే పెళ్లికి వచ్చిన అతిథులందరికీ విందు సమయంలో ఓ వింత అనుభవం ఎదురయ్యింది.

విందు భోజనాల ముందు పెళ్లికి వచ్చిన అతిథులను ఆధార్‌ కార్డ్‌ చూపించమని పెళ్లికూతురి కుంటుంబ సభ్యులు అడిగారు. దానితో ఆగ్రహించి చాలా మంది బంధువులు భోజనం తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆధార్ కార్డు తెచ్చినవారు దానిని చూపించి ఎంచక్కా విందారగించి వెళ్లారు. అయితే ఈ వింతైన సన్నివేశాన్ని మరి కొందరు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశారు. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇదీ చదవండి: 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ లోకి రాడ్డు చొప్పించి మరీ..!

Exit mobile version