Site icon Prime9

Road Accident : కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి

Karnataka: కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వెనకనుంచి కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గిరిధర్, అనిత, ప్రియ, మహేష్, జగదీష్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version