Site icon Prime9

President: రాష్ట్రపతిగా తొలి ప్రసంగం.. ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు

president

president

President: రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము.. తొలిసారిగా తన ప్రసంగాన్ని పార్లమెంట్ లో వినిపించారు. పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము.. తన తొలి ప్రసంగాన్ని పార్లమెంట్ సాక్షిగా వినిపించారు. భాజపా హయంలో.. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

దేశం ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిర్బవిస్తుందని.. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్రపతి అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందని అన్నారు. రాబోయే పాతికేళ్లు దేశానికి అత్యంత అవసరమని ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచానికి పరిష్కారలు చూపే విధంగా భారత్ ఎదుగుతుందని ద్రౌపది ముర్ము అన్నారు.

డిజిటల్ ఇండియా దిశగా భారత్..

సాంకేతికతలో ఇండియా దూసుకుపోతుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలను తీసుకొచ్చామని తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం.. ధైర్యవంతమైనది, స్థిరమైనదని పేర్కొన్నారు.

ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు.

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ గొప్ప కార్యక్రమన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ పెద్ద భరోసా అన్నారు.

గడిచిన మూడేళ్లలో 11 కోట్ల మందికి ఉచిత మంచినీరు అందించింది. నిరుపేద కోవిడ్‌ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

కేంద్రంపై ప్రశంసల జల్లు

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రపతి (President) ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం స్పందిచిన తీరును ప్రశంసించారు.

అలాగే.. ఆదివాసీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు.. వారి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మెచ్చుకున్నారు.

భేటీ బచావ్‌-భేటీ పడావ్‌ నినాదం.. మంచి సత్ఫాలితాలను ఇచ్చిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం.

దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో వివరించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar