Prime9

India Vs Pakistan: భారత్-పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు.. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్

Firing Breaks Out at India-Pakistan Borders: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు కాల్పుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే ఇప్పటికే పాక్ డీజీఎంఓతో భారత డీజీఎంఓ చర్చించింది. అయినప్పటికీ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడంతో పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

కాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి వారం రోజులు గడుస్తోంది. అప్పటి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్డుతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఓ చోట కాల్పుల మోత వినిపిస్తుంది. ఇప్పటికే కుప్వారా, అఖ్నూర్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.

Exit mobile version
Skip to toolbar