Site icon Prime9

Finance Ministry: ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లు విడుదల

FinMin-releases-grant-to-5-states

New Delhi: ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.

ఈ గ్రాంట్ 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల పై విడుదల చేసారు. పారిశుద్ధ్యం మరియు బహిరంగ మలవిసర్జన రహిత స్థితిని నిర్వహించడం, త్రాగునీరు, పారిశుధ్యం మెరుగుపరచడం, త్రాగునీటి సరఫరా, వర్షపు నీటి నిల్వ మరియు నీటి రీసైక్లింగ్ కోసం ఈ గ్రాంట్లను వినియోగించవవలసి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 10 పనిదినాల్లోగా రాష్ట్రాలు స్థానిక సంస్థలకు గ్రాంట్లను బదిలీ చేయాల్సి ఉంటుంది. 10 పనిదినాలకు మించి జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీతో సహా గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version