Site icon Prime9

Bihar: వైరల్ వీడియో.. విద్యార్థుల ఎదుటే చెప్పులతో కొట్టుకున్న మహిళా టీచర్లు

bihar

bihar

Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

వైరల్ వీడియో.. (Bihar)

విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

పాఠశాలలో విద్యార్ధుల మధ్య గొడవ చూసుంటాం. లేదా ఆ పాఠశాలలో సమస్యలు చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం వాటికి భిన్నంగా ఓ ఘటన జరిగింది.

ఆ పాఠశాలలో విద్యార్ధుల కళ్లముందే.. మహిళా టీచర్లు తన్నుకున్నారు. జుట్టుపట్టుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇంతకి ఏమైందంటే..

పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల కిటికీ తలుపులు మూయడం పట్ల ఈ సమస్య మెుదలైంది.

క్లాస్‌ రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. కానీ దీనికి సదరు టీచర్ అంగీకరించలేదు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మెుదలైంది. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా.. అనితా అనే టీచర్ ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు.

ఇక మరో టీచర్ కూడా.. అనితకు మద్దతుగా ప్రిన్సిపల్ పై దాడికి పాల్పడ్డారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు కొట్టుకున్నారు.

ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది.

అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ గా మారింది.

దీనిపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నరేశ్‌ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు.

దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Exit mobile version