Prime Minister Modi Satires: ఎట్టకేలకు అమెథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ఎవరూ పోటీ చేస్తారనే సస్పెన్స్ తెరపడింది. రాహుల్ గాంధీ అమెధీ నుంచి కాకుండా తన తల్లి నియోజకవర్గం అయిన రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో రాహుల్‌గాంధీపై సెటైర్లు విసిరారు. ‘డరో మత్, బాగోమత్” అంటూ ఎద్దేవా చేశారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. అమెధీ నుంచి పోటీ చేయాలంటే భయంతో వణికిపోతున్నాడు అని ప్రధాని రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే లోకసభ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. రాహుల్‌గాంధీ వయనాడ్‌తో పాటు మరో సురక్షితమైన స్థానంలో కోసం అన్వేషించారు అని ప్రధాని పశ్చిమ బెంగాల్‌లో బర్దమాన్ – దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాహుల్ అంశాన్ని లేవనెత్తారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనికి ఒక ఒపినీయన్ పోల్స్ కూడా అవసరం లేదన్నారు ప్రధాని.
డరో మత్, బాగో మత్..( Prime Minister Modi Satires)
అమెధీ నుంచి పోటీ చేయాలంటే రాహుల్ నిలువునా వణికిపోతున్నాడు. అందుకే రాయ్‌బరేలికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయనకు ధైర్యం చెప్పేందుకు డరో మత్, బాగో మత్ అని ప్రధాని అన్నారు. ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ… రాజ్యాంగాన్ని కాంగ్రెస్ మార్చాలనుకుంటోంది. దళితులు, వెనుకబడిన కులాల కోటాను లాగేసుకొని.. జిహాదీ ఓటు బ్యాంకును బలోపేతం చేయాలనుకుంటోందన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ది గురించి పట్టించుకోవు. తమ ఓట్ల కోసం సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తాయన్నారు ప్రధాని. స్థానిక తృణమూల్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ గురించి ప్రధాని మాట్లాడుతూ.. టీఎంసీ ఎమ్మెల్యే హిందువులను బహిరంగంగా బెదరిస్తున్నారు. అనుకుంటే హిందువులను కేవలం రెండు గంటల్లో భగరథ నదిలో ముంచి చంపేస్తానని అంటున్నాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా.. అతను రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్నారు ప్రధాని. లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి అభివృద్ది చేయాలనే ఉద్దేశం లేదన్నారు. త్రిపురను లెఫ్ట్‌పార్టీలు గత 35 ఏళ్లలో ధ్వంసం చేశాయి. బీజేపీ కేవలం ఐదు సంవత్సరాల్లో అభివృద్ది పథంలో తీసుకువచ్చాయన్నారు. ప్రస్తుతం త్రిపుర అభివృద్ది పథంలో దూసుకుపోతోందన్నారు. సందేశకాలీ నిందితులకు మమతా బెనర్జీ కొమ్ము కాస్తున్నారని ప్రధాని విమర్శించారు. మీ కలలను సాకారం చేసేది బీజేపీ పార్టీ. మీ ఓటును బీజేపీకి వేసి దేశాభివృద్దిలో భాగస్వాములు కండి అని పిలుపునిచ్చారు.