Site icon Prime9

Punjab: పంజాబ్ లో వరదనష్ఠాలకు పరిహారం చెల్లించాలంటూ రైల్ రోకో కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

Punjab

Punjab

 Punjab: వరద నష్టాలకు పరిహారం మరియు కనీస మద్దతు ధర (MSP) డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో రైతు సంఘాలు గురువారం నుంచి మూడు రోజులు పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చాయి

నష్టపరిహారంగా యాభైవేల కోట్లు..( Punjab)

నిరసనలో పాల్గొన్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ పంజాబ్ రైతులకు ఎవరైనా అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే, హర్యానా రైతులు కూడా పంజాబ్ రైతులతో కలిసిపోతారని అన్నారు.రైతులు దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉన్నారని అన్నారు. ఉత్తర భారతదేశంలోని వరదల కారణంగా పంటలను ప్రభావితం చేసిన నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవి దస్పురా వద్ద వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లు మరియు బైక్‌లతో ఆందోళన నిర్వహించారు. ఉత్తర భారతదేశంలోని 18 సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. హోంమంత్రి అమిత్ షా అమృత్‌సర్‌కు వచ్చి ఎంఎస్‌పి గ్యారెంటీ చట్టం తీసుకువస్తానని హామీ ఇచ్చారు కానీ కమిటీని ఇంకా ఏర్పాటు చేయలేదు. ఢిల్లీ ఆందోళన సమయంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోలేదని పంధర్ చెప్పారు.ప్రాణాలు కోల్పోయిన రైతులు, వారి కుటుంబాలకు హామీ ఇచ్చిన పరిహారం, ఉద్యోగాలు రాలేదు. లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధితులకు న్యాయం జరగలేదు. వరదలకు నష్టపరిహారంగా యూభైవలే కోట్లు డిమాండ్ చేశాం.. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా సరఫరా అవుతున్న డ్రగ్స్ ను సరిహద్దుల్లో తనిఖీ చేయడం లేదు. అందవలన కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాని తెలిపారు.

 

Exit mobile version