Site icon Prime9

Fake Laptop Scheme: ఈ ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్‌తో స్టూడెంట్స్ జాగ్రతగా ఉండండి!

fake laptop prime9news

fake laptop prime9news

Fake Laptop Scheme : ప్రధాన్ మంత్రి నేషనల్ ల్యాప్‌టాప్ స్కీమ్ కింద సోషల్ మీడియాలో ఓ స్కీమ్ తెగ వైరల్ అవుతుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగానే ల్యాప్‌టాప్ అందిస్తోందనే ఒక సందేశం సోషల్ మీడియాలో ఓ వార్తా తెగ చక్కెర కొడుతుంది. ఐతే ఈ స్కీమ్ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇలాంటి పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీరు చాలా మోసపోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ ఏ స్కీమ్‌ను కూడా తీసుకురాలేదు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ లేనే లేదని ముందు మీరు నమ్మాలి. అలాగే ఏది ఫేక్ వెబ్సైటు. ఏది ప్రభుత్వ వెబ్సైటు అనేది ఒక అవగాహన ఉండాలి. అప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఉచిత ల్యాప్‌టాప్ పథకాలను నమ్మకుండా ఉండొచ్చు. దాని వల్ల ఎవరికైనా ఉచిత ల్యాప్‌టాప్ పథకం అంటూ సందేశాలు వస్తే, దాన్ని నమ్మాలన్న ఒకసారి ఆలోచిస్తారు. ఈ సారి అలాంటి సందేశాలు వస్తే వెంటనే ఆ మెసేజ్‌లను డిలేట్ చేయండి. లేదంటే సైబర్ పోలీసులకు సమచారాన్ని అందించండి.

Exit mobile version